కోనసీమ జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో విజయ్ అనే యువకుడు గోదావరిలో గల్లంతయ్యాడు. విజయ్ స్వస్థలం పి.గన్నవరం గ్రామం. గంటిపెదపూడి వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా, ఈ బోటు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోదావరిలో గల్లంతైన యువకుడి కుటుంబానికి రూ.5 లక్షల సాయం ప్రకటించారు. గోదావరి నదిలో వరద ఉద్ధృతి తగ్గేంతవరకు లంక గ్రామాల ప్రజలు, గోదావరి పరీవాహక ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.