AP: న్యూ ఎడ్యుకేషన్ పాలసీపై శాసన మండలిలో రగడ జరిగింది. మంత్రి నారా లోకేశ్, వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు మధ్య రచ్చ జరిగింది. విద్యార్థుల డిక్షనరీలో దేవుడి అర్థం మార్చేశారని రవీంద్రబాబు ఆరోపించారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో కాషాయీకరణ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ ఘాటుగానే స్పందించారు. సిలబస్‌లో రాజకీయాలు చొప్పించవద్దని, కాషాయీకరణ ఎక్కడ జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.