ఎన్నిక‌ల ఫలితాలపై సజ్జల కీలక వ్యాఖ్యలు

69చూసినవారు
ఎన్నిక‌ల ఫలితాలపై సజ్జల కీలక వ్యాఖ్యలు
AP: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువే గెలుస్తామని ధీమా వ్య‌క్తం చేశారు. "మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తాం." అని తాడేపల్లిలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you