ప్రాణప్రతిష్ట వీడియో చూపిస్తూ.. ఆపరేషన్ చేశారు!

1048చూసినవారు
ప్రాణప్రతిష్ట వీడియో చూపిస్తూ.. ఆపరేషన్ చేశారు!
బాలరాముడి ప్రాణప్రతిష్ట వీడియోను చూపిస్తూ వైద్యులు పేషంట్‌కు ఆపరేషన్ చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన దానబోయిన మణికంఠ (29) మెదడులోని అత్యంత కీలకమైన ప్రాంతంలో 7 సెం.మీల కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ సమయంలో పేషంట్ మెలకువగా ఉండాలి. దాంతో డాక్టర్లు రోగికి ఇష్టమైన బాలరాముడి ప్రాణప్రతిష్ట వీడియోను చూపించారు. ఆపరేషన్ విజయవంతమైంది.

సంబంధిత పోస్ట్