సముద్రంలో స్నానానికి వెళ్లి అక్కాచెల్లెళ్లు మృతి

563చూసినవారు
సముద్రంలో స్నానానికి వెళ్లి అక్కాచెల్లెళ్లు మృతి
అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. ఈ ఘటన అచ్యుతాపురం మండలం తంతడి బీచ్‌లో జరిగింది. మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు నూకరత్నం, కనకదుర్గ, మరొకరితో కలిసి తంతడి బీచ్‌కు వెళ్లారు. ముగ్గురు సముద్రంలో స్నానానికి వెళ్లారు. భారీ అలలు రావడంతో అక్కాచెల్లెళ్లు కొట్టుకుపోయారు. ఊపిరాడక ప్రాణాలు విడిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్