వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇవాళ వెలిగొండ, హంద్రీనీవా, పోలవరం, పోలవరం ఎడమ కాల్వ పనులపై నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. హంద్రీనీవా ప్రధాన కాల్వ విస్తరణ, లైనింగ్ పనులకు సంబంధించి అధికారులను మంత్రి ఆరా తీశారు. నవంబర్‌లో పనులు మొదలుపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సమీక్షలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.