ఆగి ఉన్న లారీని ఓ బస్సు ఢీకొంది. ఈ సంఘటన ఉలవపాడు మండలం చాగొల్లు వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగింది. 33 మంది ప్రయాణికులతో హైదరాబాదు నుండి చెన్నై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చాగల్లు సమీపంలోకి రాగానే రోడ్డు పై ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 4 గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనం ద్వారా గాయపడిన వారిని కావలి వైద్యశాలకు తరలించారు.