కోవూరు మండలం, కోవూరు సచివాలయం-2లో వాలంటీర్లుగా సేవలందిస్తున్న దాదాపుగా 29 మంది వాలంటీర్లు బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా చేసిన పత్రాలను పంచాయితీ కార్యదర్శికి అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు మాట్లాడుతూ. తమపై ఎటువంటి ఒత్తిళ్లు లేవని, మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామని తెలియజేశారు.