శెట్టూరు మండలం ఆనుంపల్లి గ్రామంలో మొన్న కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జ్ పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో అటుగా వెళ్లే విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే సురేంద్రబాబు బ్రిడ్జ్ నిర్మాణానికి కావలసిన చర్యలు వెంటనే చేపట్టారు. అధికారులు కూడా బ్రిడ్జ్ పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. మరో నెలలోపు నిర్మాణం పూర్తవుతుందన్నారు.