పిడుగు పడిన చోట ఉబికి వస్తున్న పాతాల గంగ

9893చూసినవారు
పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల పరిధిలోని గౌనివారిపల్లిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో గ్రామ సమీపంలోని సోమశేఖర్ రెడ్డి పంట పొలంలో పిడుగు పడగా నీరు భారీగా చేరింది. దీంతో గ్రామస్తులు అందరూ నీరు చేరిన చోట పరిశీలించగా రెండు మూడు చోట్ల ఉబికి వస్తున్న పాతాళ గంగను చూసి ఆశ్చర్యపోయారు. దీంతో గ్రామ ప్రజలు సమీప ప్రాంత ప్రజలు తండోపతండాలుగా వచ్చి అక్కడ వస్తున్న నీటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్