Top 10 viral news 🔥
ఏపీకి మళ్లీ అల్ప పీడనం.. భారీ వర్షాలు
ఏపీకి మరో ముప్పు పొంచుకొస్తుంది. వాయవ్య బంగాళాఖాతంలో ఈ నెల 5 లేదా 6 తేదీల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 7 నుంచి 11 వరకు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.