
ఆమదాలవలస: భూ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే కూన
రైతుల భూ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసిందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శనివారం బూర్జ మండలం తోటవాడ గ్రామంలో అధికారులు నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు. ప్రజల నుంచి భూ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు