ఆముదాలవలస మహిళా మండల సమాఖ్యలో మంగళవారం సేంద్రియ వ్యవసాయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. నవధాన్యాల సాగు మరియు పచ్చిరొట్ట ఎరువులతొ నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని వైయస్సార్ క్రాంతి పదం ఏపిఎం పైడి కూర్మారావు అన్నారు. గ్రామస్థాయిలో వెలుగు మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు ఈ మేరకు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.