ఆముదాలవలస పట్టణం లక్ష్మీ నగర్ లో గల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గురువారం ఆర్యవైశ్య ప్రతినిధులకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన తమ్మన భాస్కర్ ని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎంపిక అయిన సందర్భంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యులలో నిరుపేదలను ఆదుకుంటామని సంఘం ప్రతినిధులు తెలిపారు. డాక్టర్ తాతయ్యలు, తమ్మన రామకృష్ణ, గోపికృష్ణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.