ప్రజా తీర్పుతో మామ అల్లుళ్ళకు కనువిప్పు కలిగించాలి

58చూసినవారు
ప్రజా తీర్పుతో మామ అల్లుళ్ళకు కనువిప్పు కలిగించాలి
ఆముదాలవలస నియోజకవర్గంలోని ప్రజా తీర్పుతో మామఅల్లుళ్లకు కనువిప్పు కలిగించాలని వైకాపా రెబల్ స్వతంత్ర అభ్యర్థి సువ్వారి గాంధీ అన్నారు. బుధవారం మండలంలోని రామచంద్రాపురం గ్రామం లో ఎన్నికలప్రచారం చేపట్టారు. నియోజకవర్గంలో టిడిపి వైసిపిలో ఉన్న నాయకుల మాయమాటలు వినిఓటర్లు మోసపోవద్దని సూచించారు. స్వతంత్ర అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్