సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని మాజీ జడ్పీటీసీ, నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు సనపల నారాయణరావు అన్నారు. ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్ గ్రామంలో ఆదివారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి. వైసీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ, రానున్న ఎన్నికల్లో మరోసారి జగన్ ను సీఎంగా గెలిపించాలన్నారు