కౌంటింగ్ సెంటర్లోకి మొబైల్స్ తీసుకురాకూడదు - ఎస్పీ

58చూసినవారు
కౌంటింగ్ సెంటర్లోకి మొబైల్స్ తీసుకురాకూడదు - ఎస్పీ
ఎచ్చెర్లలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కాలేజీలోని ఈనెల 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు వచ్చే కౌంటింగ్ సిబ్బంది, పోటీ చేసిన అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్స్ కు జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక పలు సూచనలు చేశారు. కౌంటింగ్ సెంటర్లోకి మొబైల్స్ తీసుకురాకూడదని, అలాగే వారికి కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వారి వాహనాలు పార్క్ చేయాలని, కౌంటింగ్ సెంటర్ పరిసర ప్రాంతం రెడ్ జోన్ గా ప్రకటించామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్