విద్యార్థి దశ కీలకమని జేసీఐ వ్యక్తిత్వ వికాస నిపుణురాలు ఎం. సునీత అన్నారు. ఇచ్ఛాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వోన్నత పాఠశాల, వెంకటేశ్వర ప్రైవేటు పాఠశాలలో జేసీఐ ఆధ్వర్యంలో 'లెట్స్ మేక్ ఏ డిఫరెన్స్' పేరుతో వ్యక్తిత్వ వికాస తరగతులు బుధవారం నిర్వహించారు. ఉజ్వల భవిష్యత్ కోసం ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రబీన్ కుమార్ పాడీ, ప్రభుత్వోన్నత పాఠశాల హెచ్ఎం విశ్వనాథ్ ఉన్నారు.