సంక్షేమ పాలనకు చిరునామాగా వైసిపి నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ అన్నారు. కవిటి మండలం ఇద్దివానిపాలెం, బట్టివాని పాలెం, చిన్నకర్రివానిపాలెం గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో వైసిపితోనే అభివృద్ధి సాధ్యమని, గత ఐదేళ్లుగా సంక్షేమంతో పాటు అనేక అభివద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత వైసిపిదేనని అన్నారు. వైసిపి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు.