ఈ నెల 7న రాజ్ నాథ్ సింగ్ రాక

77చూసినవారు
ఈ నెల 7న రాజ్ నాథ్ సింగ్ రాక
కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈనెల 7వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి ఎన్. డి. ఏ కూటమి తరపున బిజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నడుకుదిటి ఈశ్వరరావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఆయన ఆరోజు 11: 50 నిమిషాలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో 12: 10కి ఎచ్చెర్ల హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12: 20 ని నుంచి 1: 10ని వరకు ఎచ్చెర్ల బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.