జీవో 85 కి వ్యతిరేకంగా ప్రభుత్వ పీహెచ్సి వైద్యల ఆందోళన

79చూసినవారు
జీవో 85 కి వ్యతిరేకంగా ప్రభుత్వ పీహెచ్సి వైద్యల ఆందోళన
ఏపీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు జీవో 85కి వ్యతిరేకంగా ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు టెక్కలి డివిజన్ వైద్యులు అందరూ బుధవారం నల్ల బ్యాడ్జిలు ధరించి విధులు నిర్వహించారు. తమ మూడు ఏళ్ళ సర్వీసు అర్దం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కె. కొత్తూరు వైద్యులు ఇంద్రజ, లింగాలవలస డాక్టర్ తేజ, డాక్టర్ భాగ్యశ్రీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్