యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ బెదిరింపు
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామంటూ ముంబయి పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. 'బాబా సిద్ధిఖీలాగా యూపీ సీఎంను చంపుతాం' అంటూ దుండుగులు అందులో హెచ్చరించారు. ఆయన పది రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఈ మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది.