టిడిపి గెలుపుకు కృషి చేయాలి- కలిశెట్టి

71చూసినవారు
టిడిపి గెలుపుకు కృషి చేయాలి- కలిశెట్టి
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపునకు ప్రతి ఒక్క కార్యకర్త గ్రామస్థాయిలో కృషి చేయాలని ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రణస్థలం మండల కేంద్రంలోని స్థానిక టిడిపి కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎచ్చెర్ల నియోజకవర్గ పార్టీ శ్రేణులతో కలిశెట్టి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.