పాలకొండ: ఇసుక తవ్వకాలు ఆపాలి

75చూసినవారు
నాగావళి నదిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పాలకొండ మండల కమిటీ శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కమిటీ కన్వీనర్ దావాల రమణారావు మాట్లాడుతూ.. తాగునీటి పథకాలకు 100-200 మీటర్ల పరిధిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్