విద్యార్థులకు చిత్రలేఖనం లో ప్రతిభను వెలికితీయడానికి చిత్ర లేఖనం పోటీలను మెలియాపుట్టి గ్రంథాలయ అధికారి అనురాధ శనివారం నిర్వహించారు. చిత్రలేఖనం అనేది అతి ముఖ్యమైందన్నారు. విద్యా ర్థుల సృజనాత్మకతకు వేదికగా అనేక పుస్తకాలను అందుబాటులో ఉంచామన్నారు. నీతికథలు, జనరల్ నాలెడ్జ్, ప్రముఖుల జీవిత చరిత్రలు, ప్రపంచ వింతలు తెలిపే పుస్తకాలు ఉన్నాయన్నారు. సద్వినియోగం చేసుకోవాలన్నారు.