ఘనంగా భగవాన్ మద్విరాట్ విశ్వకర్మ నిమజ్జనోత్సవం వేడుకలు

81చూసినవారు
ఆముదాలవలస పట్టణంలో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీమద్విరాట్ విశ్వకర్మ పూజలు శనివారంతో ముగిశాయి. స్థానిక రైల్వే స్టేషన్ కూడలి వద్ద, ఆమదాలవలస రామ మందిరం వద్ద ఏర్పాటుచేసిన విశ్వకర్మ మండపం నుంచి నిమజ్జనోత్సవం ఊరేగింపు శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా బరంపురం కళాకారులతో ఏర్పాటు చేసిన వివిధ ఊరేగింపు సాంస్కృతిక డాన్సులు పలువురిని ఆకట్టుకున్నాయి. వేర్వేరుగా విశ్వకర్మ పూజలను చేశారు.

సంబంధిత పోస్ట్