టెక్కలి మండలం ముఖలింగాపురం, నరసింగపల్లి పంచాయతీలో శుక్రవారం టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మీకిచ్చిన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు, ఎంపీగా పోటీ చేస్తున్న పేరాడ. తిలక్ కు గెలిపించాలని కోరారు. సంక్షేమ రాజ్యం కొనసాగాలంటే, వైసిపికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.