వంతెన పనులు కారణంగా 3, 4 తేదీల్లో పలు రైళ్లు రద్దు

50చూసినవారు
వంతెన పనులు కారణంగా 3, 4 తేదీల్లో పలు రైళ్లు రద్దు
శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను ఈ నెల 3, 4 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు శనివారం ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ కె. స్యాందీప్ తెలిపారు. నౌపడ-పూండీ మెయిన్ లైన్లో వంతెన పనులు నేపథ్యంలో 3వ తేదీన పలాస-విశాఖ (07470) ప్యాసెంజర్, విశాఖ-గునుపూర్ (08522) ప్యాసెంజర్, విశాఖ- బరంపురం (18526), 4వ తేదీన బరంపురం-విశాఖపట్నం (18525) ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు చేశారు.