ముగిసిన నౌపడ గ్రామ దేవత సంబరాలు

సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో ఆదివారం నుండి జరుగుతున్న పాల పోలమ్మ తల్లి గ్రామ దేవత బల్లోల సంబరాలు మంగళవారం వైభవంగా ముగిశాయి. ఆలయానికి వేకువజాము నుండే భక్తులు బారులు తీరారు. మహిళలు గుంపుగా ముర్రాటలు, ప్రసాదాలతో ఊరేగింపుగా వెళ్లి పోలమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. బుర్రకథ, పగటి వేషాలు, తోలుబొమ్మలాట, మెగా డాన్సులు, డీజే డాన్సులతో 3 రోజులు గ్రామంలో గ్రామస్తులు సందడిగా సంబరాలు జరుపుకున్నారు.