టెక్కలి మండల కేంద్రం గోపినాధపురం లోని జామియా మసీద్ లో గురువారం రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టెక్కలి పరిసర ప్రాంత ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ముస్లింల విశిష్ట పర్వదినాల్లో ఒక్కటైన రంజాన్ రోజున అల్లాను స్మరిస్తూ ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా రంజాన్ విశిష్టత గురించి మసీద్ నిర్వాహకులు వివరించారు. రంజాన్ వేడుకల్లో టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ పాల్గొన్నారు.