ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న నవదేవ్(22) సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మానసిక ఒత్తిడి తాళలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.