AP: విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ఓ స్కూల్‌లో విద్యార్థి కళ్లు తిరిగి పడిపోగా.. పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. స్కూల్‌కు చేరుకున్న తల్లిదండ్రులు హుటాహుటిగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి విద్యార్థిని తరలించారు. చికిత్స కోసం వైద్య సిబ్బంది ఇచ్చిన ఇంజక్షన్ వికటించడంతో విద్యార్థి మృతి చెందాడు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.