సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ ఎమ్మెల్యే విమర్శలు

59చూసినవారు
సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ ఎమ్మెల్యే విమర్శలు
AP: సుప్రీంకోర్టు తీర్పుపై తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవ మతంలోకి మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తప్పుపట్టారు. 'వెనుకబడిన కులాలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు క్రైస్తవులకు రిజర్వేషన్లు ఉండవని చెప్పింది. ఇది ఒక అన్యాయమైన తీర్పు. రాజ్యాంగం కులాలకు రిజర్వేషన్లు ఇస్తే మతానికి ముడిపెట్టడం తప్పు' అని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్