అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని మూల స్వయంభువరం గ్రామ ప్రజలు 2024 సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. దశాబ్దాలుగా పరవాడ ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కర్మాగారం నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి వల్ల తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని, సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. కాగా, 2024 సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించిన తొలి గ్రామం ఇదే.