ఏపీలో వరద నష్టం రూ.6,882 కోట్లు

66చూసినవారు
ఏపీలో వరద నష్టం రూ.6,882 కోట్లు
ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ఆర్ అండ్ బీకి రూ.2,164.5 కోట్లు, నీటి వనరుల శాఖకు రూ.1568.5 కోట్లు, పురపాలక శాఖకు రూ.1,160 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.481 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.301 కోట్లు, పంచాయతీ రోడ్లకు రూ.167.5 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్