పంచాయతీల్లో డబ్బులు లేవు: డిప్యూటీ సీఎం

56చూసినవారు
పంచాయతీల్లో డబ్బులు లేవు: డిప్యూటీ సీఎం
AP: గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసిందని.. రాష్ట్రంలోని పంచాయతీల్లో ఎక్కడా డబ్బులు లేవని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. "వేస్ట్‌ మేనేజ్‌మెంట్, పరిశుభ్రతను ప్రజలు బాధ్యతగా తీసుకోవాలి. ఒక్కో పంచాయతీలో చెత్త సేకరించి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తాం. చెత్తతో ఏటా రూ. 2,643 కోట్ల ఆదాయం తీసుకు రావచ్చు. రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు వీలవుతుంది." అని ఆయ‌న వివ‌రించారు.

సంబంధిత పోస్ట్