ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాలెం గ్రామంలో గురువారం ఉదయం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ విచ్చేశారు. దివ్యాంగుడు పులి సుమన్ కు పెన్షన్ నగదును జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయిలహరి, ఎన్డీఏ కూటమినేతలు కైలాసం శ్రీనివాసులు రెడ్డి, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.