చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నందు ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యులు శనివారం కోల్కత్తా లో మహిళా వైద్యురాలి పై అత్యాచారం , హత్య ను ఖండిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వైద్యుల రక్షణ కోసం ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని. కోల్కతాలో వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.