బుచ్చినాయుడు కండ్రిగ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో గురువారం ఉదయం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసిల్దార్ ఐ. సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేతులు మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు, సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు.