
తడ మండలంలో సూపరిపాలన తొలి అడుగు
తడ మండలంలోని మాంబట్టు, కాదలూరు, వెండ్లూరుపాడు గ్రామాలలో శనివారం సూపరిపాలన తొలి అడుగు కార్య క్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఆమె ప్రతి ఇంటికి వెళ్లి కూటమి చేసిన అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.