పాకాల మండలం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మునీర్ కొడుకు అఫ్రిద్ ను తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శనివారం పరామర్శించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అఫ్రిద్ మెరుగైన వైద్యసేవలు నిమిత్తం తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రికి చేరుకున్న మోహిత్ రెడ్డి అఫ్రిద్ కు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడిన అఫ్రిద్ కు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.