'మా ఫ్యామిలీలో ఇద్దరు పద్మవిభూషణులు'

10581చూసినవారు
'మా ఫ్యామిలీలో ఇద్దరు పద్మవిభూషణులు'
మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకోనుండడంతో మెగా ఫ్యామిలీలో ఆనందోత్సాహాలు మిన్నంటుతున్నాయి. తాజాగా, మెగా కోడలు ఉపాసన ఆసక్తికర ట్వీట్ చేశారు. తమ కుటుంబంలో ఇద్దరు పద్మవిభూషణలుండటం గర్వంగా, గౌరవంగా ఉందని, తన తాతగారు, మామగారు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. కాగా, ఉపాసన తాతగారైన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి 2010 లో పద్మవిభూషణ్ అందుకున్నారు.

సంబంధిత పోస్ట్