ఏపీలో వాలంటీర్లు రోడ్డెక్కారు. రాష్ట్ర వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నేడు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డుపై తలకిందులుగా నిలబడి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. రూ.10,000 గౌరవ వేతనం ఇవ్వాలి. ఐదు నెలల పెండింగ్ బకాయిలు చెల్లించాలి. రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అని కోరారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పుడు మాట మార్చడం కరెక్ట్ కాదని వాలంటీర్లు అన్నారు.