విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

79చూసినవారు
విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
చీపురుపల్లి మండలంలో స్థానికంగా ఉన్న విజ్ఞాన్ పాఠశాలలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ రాము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారత్ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిందని, రాజ్యాంగం రాయడానికి 2సంవత్సరాల 11నెలల 18రోజులు పట్టిందని, 64లక్షలు రూపాయలు ఖర్చు అయిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్