గజపతినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో, మన్యం వీరుడు, అగ్గి పిడుగు, అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ మన్యం ప్రజల కోసం వారి స్వతంత్రం కోసం చిన్నతనంలోనే పోరాడిన గొప్ప స్వతంత్ర యోధుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.