స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతమూ అలరించాయి. ముందుగా ప్రదర్శించిన పోలీసు జాగిలాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నెల్లిమర్ల ఎంజెపిఏపిబిసివెల్ఫేర్ స్కూల్, విజయనగరం ఫోర్ట్ సిటీ స్కూల్, పిఎస్ఆర్ స్కూల్, అంబేద్కర్ బాలియోగి గురుకులం తదితర విద్యాసంస్థల విద్యార్ధులు దేశభక్తి గీతాలతో నృత్య ప్రదర్శనలు చేసి అలరించారు