బొబ్బిలి పట్టణంలోని స్థానిక కోటలో ఎమ్మెల్యే బేబీ నాయన ఆధ్వర్యంలో 100 మంది విశ్రాంత ఉపాధ్యాయులకు గురువారం ఘన సన్మానం చేశారు. ఎమ్మెల్యే విశ్రాంతి ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి సాలువాలతో సత్కరించారు. చదువు చెప్పిన గురువులను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. విశ్రాంత జీవితాన్ని చక్కగా గడపాలని ఆకాంక్షించారు. గురువులు దైవ సమానులని, ఉత్తమ ఉపాధ్యాయులను తన చేతులు మీద సన్మానించడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే అన్నారు.