

గజపతినగరం: సోలార్ విద్యుత్ ను సద్వినియోగం చేసుకోవాలి
సోలార్ విద్యుత్ ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. గురువారం సాయంత్రం గజపతినగరంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు జరిగింది. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, ఎస్.ఈ లక్ష్మణరావు, పిడి కళ్యాణ్ చక్రవర్తి, ఏడిఈ శివకుమార్, గోపాలరాజు, శ్రీదేవి, ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.