Mar 29, 2024, 17:03 IST/ఖానాపూర్
ఖానాపూర్
ఇండిపెండెంట్ ఎంపీలను గెలిపించుకుంటాం
Mar 29, 2024, 17:03 IST
బీసీ కులస్తుల విషయంలో పార్టీలు కలిసి రాకపోతే ఇండిపెండెంట్ బిసి ఎంపీలను గెలిపించుకుంటామని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి ఆదిలాబాద్ కన్వీనర్ కోడూరు చంద్రయ్య స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని రెండు సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్న పార్టీలు పట్టించుకోవడం లేదన్నారు. లక్ష్య సాధనకు అవసరమైతే ఇండిపెండెంట్ బిసి ఎంపీలను గెలిపించుకుంటామని అన్నారు.