ఆర్టీసీ బస్సులో గంజాయి స్వాధీనం

1040చూసినవారు
సాలూరు నుంచి విశాఖ వెళుతున్న ఆర్టీసీ బస్సులో 14. 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పెదమానాపురం ఎస్ఐ శిరీష సోమవారం రాత్రి విలేకరులకు తెలిపారు. పెదమానాపురం రైల్వేగేటు పడడంతో టిక్కెట్లు తనిఖీ చేస్తుండడంతో ఇద్దరు వ్యక్తులు బస్సు దిగి పారిపోగా, వారు కూర్చున్న సీటు వద్ద బ్యాగులు తనిఖీ చేయగా గంజాయి ఉండడంతో తమకు సమాచారం బస్సు డ్రైవర్ గణపతి అందజేశారని చెప్పారు. నిందితుల కోసం గాలింపు చేపట్టామన్నారు.

సంబంధిత పోస్ట్